ఆ రియల్ కబడ్డీ ప్లేయర్ జీవితాన్ని తెరపై చూపించబోతున్న మూవీ...
ఇక ఆ సినిమా విషయానికి వస్తే కొత్తవాళ్లతో కబడ్డీ నేపథ్యంలో 'అర్జున్ చక్రవర్తి' అనే సినిమా తెరకెక్కుతోంది. కొత్త కుర్రాడు వేణు కేసీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ రామరాజు, సిజా రోజ్ ప్రధాన పాత్రధారులు.చరిత్రలో తనకంటూ ఓ పేజీ లేని ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందట.రెండేళ్ల క్రితం ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిచారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్ము కశ్మీర్ సహా మొత్తంగా దేశంలో 125 ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరిపారట. ఇక ఈ సినిమాలో హీరోగా ఏడు రకాల మేకోవర్‌తో కనిపిస్తాడట. అంటే చిన్న పిల్లాడి నుండి మధ్య వయస్కుడి వరకు అన్నీ ఒకడే నటించాడట.ఇక ఈ సినిమా కోసం 1960, 80ల నాటి పరిస్థితులు కనిపించేలా సెట్స్ కూడా వేశారట. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత హిందీ, మలయాళం, కన్నడలోకి డబ్బింగ్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...