సినీ నటుడు మాధవన్ కి కరోనా పాజిటివ్ అని తెలిసి ఏమి చేసాడంటే..?

Suma Kallamadi
దేశవ్యాప్తంగా  కరోనా వైరస్ మళ్ళీ తన పంజా విసురుతుంది. తగ్గినట్లే తగ్గి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక వైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినాగాని కేసుల సంఖ్య మాత్రం ఏమి తగ్గడం లేదు. చాలామంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలను సైతం విడిచారు. తాజాగా ఇప్పుడు మళ్ళీ సినీ ఇండస్ట్రీలోని నటులకు సైతం కరోనా ముప్పు తప్పేటట్టు లేదు. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీ కోలుకుంటుందని అనుకునే లోపే మళ్ళీ కేసులు పెరిగిపోతున్నాయి.

 ఇటీవల కాలంలో సినీ ప్రముఖులపై కరోనా పంజా విసురుతోంది. షూటింగ్‌లకు వెళ్తోన్న నటీనటుల్లో ఒక్కొక్కరు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.అలాగే ఈ మధ్యనే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కి కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.  అమిర్ ఖాన్,మాధవన్ ఇద్దరు కలిసి 3 ఇడియట్స్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.


 ఇప్పుడు మాధవన్ అమిర్ ఖాన్ తో కలిసి ఉన్న  3 ఇడియట్స్ సినిమాలోని ఫొటోను షేర్ చేసి ఒక  ఫన్నీ కామెంట్ కూడా జత చేసాడు.  రాంచో(3 ఇడియట్స్ లో ఆమిర్ ఖాన్  పాత్ర పేరు)ను ఫర్హాన్(3 ఇడియట్స్ లో మాధవ్ పేరు) ఫాలో అవుతుంటే.. కరోనా వైరస్  (3 ఇడియట్స్  లో బొమన్ ఇరానీ) మా ఇద్దరి వెంట పడేవాడు. అయితే ఈసారి వాడికి(కరోనా వైరస్‌కు) మేము చిక్కాము. ఆల్ ఈజ్ వెల్. అంటూ రాసుకొచ్చాడు.కరోనా వైరస్‌కి కూడా త్వరలో చెక్ పడుతుంది. ఈ ఒక్క స్థానంలోకి మాతో పాటు రాజు రాకూడదని అనుకుంటున్నాము అని కామెంట్ పెట్టాడు.  అలాగే అందరికీ ధన్యవాదాలు. నా ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది అని కామెంట్ పెట్టారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: