మళ్ళీ తెర పైకి రైన్ సాంగ్ ట్రెండ్ !

Seetha Sailaja
తెలుగు సినిమాలలో ఒకప్పుడు హీరో హీరోయిన్స్ మధ్య రైన్ సాంగ్ లేకుండా సినిమాలు ఉండేవి కావు. అక్కినేని నాగేశ్వరావు బి. సరోజ దేవి హీరో హీరోయిన్స్ గా నటించిన ‘ఆత్మబలం’ మూవీ నుండి ఈ రైన్ సాంగ్ ట్రెండ్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మొదలైంది. ఆతరువాత సుమారు మూడు దశాబ్దాల పాటు రకరకాల పాటలు వర్షం చుట్టూ తిరిగాయి.

అక్కినేని ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు చిరంజీవిల సినిమాలలో ఈ వర్షం బ్యాక్ డ్రాప్ గా వచ్చే అనేక హిట్ సాంగ్స్ ఉన్నాయి. అయితే ఆతరువాత యంగ్ హీరోల హవా మొదలైన తరువాత ఈ రైన్ సాంగ్స్ ట్రెండ్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పాత ట్రెండ్ ను లేటెస్ట్ గా ఈతరం ప్రేక్షకులకు శేఖర్ కమ్ముల పరిచయం చేస్తున్నాడు.

ఇతడి దర్శకత్వంలో త్వరలో విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’ పాటలు అన్నీ వరసపెట్టి హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా లేటెస్ట్ గా విడుదలైన ‘సారంగ దరియా’ సాంగ్ సూపర్ హిట్ కావడమే కాకుండా వివాదాలతో పాటు మిలియన్స్ కొద్ది వ్యూస్ ను తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను కొనసాగించడానికి శేఖర్ కమ్ముల ఈమూవీలోని 4వ పాటను రిలీజ్ చేయబోతున్నాడు.

నేడు మహేష్ చేతుల మీదగా విడుదల కాబోతున్న ఈపాటకు సంబంధించిన పోష్టర్ లో వర్షం బ్యాక్ డ్రాప్ గా కనిపిస్తోంది. దీనినిబట్టి చూస్తే మళ్ళీ శేఖర్ కమ్ముల అలనాటి ‘వర్షం’ పాటల ట్రెండ్ కు మొగ్గు చూపుతున్నాడు అనుకోవాలి. ‘ఏవో ఏవో కలలే’ అంటూ ఒక రొమాంటిక్ సాంగ్ గా ఈపాట ఉండబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీలో మహేష్ వీరాభిమానిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు. అలాంటి పరిస్థితులలో మహేష్ చేత ఈమూవీలోని పాట రిలీజ్ కావడం ఒక విశేషం. అయితే భారీ అంచనాలు ఉన్న ఈమూవీ వచ్చేనెల విడుదల అవుతున్న పరిస్థితులలో అప్పటికి ధియేటర్ల పరిస్థితి కరోనా సమస్యల వల్ల ఎలా ఉంటుందో సమాధానం లేని ప్రశ్నగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: