వైల్డ్ డాగ్ నాగ్ కెరీర్లో బెస్ట్ మూవీ అవ్వడం ఖాయమట....
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది నిజమైన సంఘటన ఆదారంగా తెరకెక్కింది.హైదరాబాద్ లో జరిగిన గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ తరువాత జరిగిన ఎన్కౌంటర్ గురించి ఎన్ఐఏ చేసినా ఒక సీక్రెట్ ఆపరేషన్ ఈ సినిమా కథ.ఇదో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందట.ఇక ఈ చిత్రం రన్ టైం కేవలం 2 గంటల 6 నిమిషాలకు వచ్చిందని దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులని మంచి థ్రిల్ కి గురి చేస్తుందట. ప్రతి సీన్ చాలా ఆసక్తిగా తెరకెక్కించాడట డైరెక్టర్.ప్రేక్షకులను ఆసాంతం సినిమాలో లీనం చెయ్యడం ఖాయమట.2016 ఊపిరి తర్వాత నాగార్జునకు హిట్ లేదు. దానితో ఆయన, ఆయన అభిమానులు ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
ఈ చిత్రం ముందుగా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు. అయితే చివరి నిముషంలో థియేటర్లు తెర్చుకోవడం, ప్రేక్షకులు ఆసక్తిగా రావడంతో ఆ ఆలోచన విరమించుకుని థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర బృందం వారు. ఇక చూడాలి ఈ సినిమా నాగార్జునకి ఎంతమాత్రం బ్రేక్ ఇస్తుందో...