కొత్త దర్శకుడితో సినిమా చేయనున్న మహేష్... కాని ఒక షరతు..?.
మహేష్ నటించిన చివరి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో సర్కారు వారి పాటతో మహేష్ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో నటించాల్సి ఉన్నా రాజమౌళి సినిమా మొదలయ్యేలోపు మహేష్ ఒకటి లేదా రెండు సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే మరో సినిమా షూటింగ్ లో మహేష్ పాల్గొనడానికి రాజమౌళి అంగీకరించరు.
అందుకే సర్కారు వారి పాట తరువాత అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ బాబు నటించనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు మాత్రం ఒక కొత్త టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే మహేష్ బాబు కొత్త డైరెక్టర్ ను ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొని రమ్మని చెప్పారని.. కేవలం రెండు నెలలలోనే షూటింగ్ ను పూర్తి చేయాలని షరతు కూడా విధించారని తెలుస్తోంది. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే.