జాన్వీ కపూర్ ని ముద్దు అడిగిన అభిమాని...?

VAMSI
ప్రస్తుతం వేగంగా ఉన్న అంతర్జాల మాయాజాలంలో అభిమానులకు మరింత చేరువ అయిపోతున్నారు ప్రముఖ సెలెబ్రిటీలు. ఇక సినిమా రంగంలో ఉన్న నటీనటులైతే చెప్పనవసరం లేదు. ప్రతి రోజూ తమ సినిమాలకు సంబంధించిన వార్తలు వారితో పంచుకోవడం కూడా ఒక విధమైన ప్రమోషన్ లో భాగంగా మారిపోయింది. ఇయితే ఇవంతా అభిమానులు హద్దు మీరనంత వరకే బాగుంటాయి. అయితే తాజాగా శ్రీదేవి నటవారసురాలు అయిన జాన్వీ కపూర్ కు ఒక వింత అనుభవం ఎదురైంది.  తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు జాన్వీ కపూర్ తన క్యూట్ ఆన్సర్స్ తో సమాధానాలు చెప్పారు.

అయితే ఒక అభిమాని మాత్రం ఈ చనువును అలుసుగా తీసుకుని ముందూ వెనుకా ఆలోచించకుండా మేము ముద్దు పెట్టుకోవచ్చా అని  అడిగాడు. ఈ ప్రశ్నకు జాన్వీ వెంటనే స్పందించి...తాను మాస్కు ధరించిన ఫోటో ను పోస్ట్ చేసి కుదరదు అంటూ తనదైన క్యూటీ స్టైల్ లో జవాబిచ్చింది. అయితే దీనికి అర్ధం కరోనా మహమ్మారి ఉన్న సమయం కాబట్టి ముద్దులకు ఎటువంటి అవకాశం లేదన్నది ఆమె అభిప్రాయం.  దీనితో సదరు అభిమాని కంగు తిన్నాడు. ఈ ప్రశ్నతో పాటు ఫ్యాన్స్ నుంచి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్ని ప్రశ్నలకు జాన్వీ ఓపిగ్గా సమాధానాలిచ్చింది.

మరొక అభిమాని తన డైట్ గురించి ప్రశ్నించగా, చేతిలో ఉన్న ఐస్ క్రీం కప్పుతో తన ఫోటోను షేర్ చేయడమే కాకుండా...ఒక రోజుకు 4 స్కూప్స్ మాత్రమే అంటూ క్యాప్షన్ ను జత చేసింది. మరొకరు తనకు ఇష్టమైన జ్ఞాపకం గురించి అడిగితే.. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యాన్స్ కోసం దక్షిణాన రోడ్ ట్రిప్పింగ్ వెళ్లడం.. అని చెప్పింది. వేరొక ప్రశ్నగా మీ అభిమాన నటుడు ఎవరు అని అడుగగా...గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రంలో నటించిన పంకజ్ త్రిపాఠి కౌగిలించుకున్న ఫోటోను పంచుకుంది. ఇంకొకరు... ఆందోళనగా ఉన్న సమయంలో మీరు ఏమి చేస్తారని ప్రశ్నించగా...ఒక దిండును కౌగలించుకుని బాధాకరమైన పాటలు పాడుతానని చెప్పడంతో ఆశ్చర్యపోవడం అభిమాని వంతయింది. ఇలా ఈ కార్యక్రమాన్ని సరదా సరదాగా పూర్తి చేసింది. ఈమె ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ అనే చిత్ర షూటింగును పూర్తి చేయడం జరిగింది. సిద్దార్థ్ సేన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: