సుకుమార్ అనుమతి లేనిదే బుచ్చిబాబు మరో సినిమా చేయలేరా..
సుకుమార్ సహకారం లేకపోతే బుచ్చిబాబు సనా కథ అద్భుతమైన సంగీతంతో, చూడదగిన సినిమాటోగ్రఫీతో ఓ బ్రహ్మాండమైన దృశ్య కావ్యంగా తెరకెక్కపోయేదేమో. సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేసే విషయం నుంచి టోటల్ అవుట్ పుట్ నిర్ణయించేవరకు బుచ్చిబాబు కి మార్గదర్శకులయ్యారు. అలాగే ఉప్పెన సినిమాపై తారాస్థాయిలో అంచనాలు నెలకొల్పడంలో కూడా సుకుమార్ కీలక పాత్ర పోషించారు. ఐతే తమ గురువు సుకుమార్ పర్యవేక్షణలో సినిమాలు తీస్తేనే అవి కోట్ల మంది ప్రేక్షకులకు చేరువ కాగలవని వారి శిష్యులు భావిస్తున్నారో ఏమో కానీ గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన కుమారి 21ఎఫ్ సినిమా తెరకెక్కించిన సూర్య ప్రతాప్ ఇప్పటివరకు తన సొంతంగా ఒక్క సినిమాను కూడా డైరెక్ట్ చేయలేదు.
ఎప్పుడైతే సుకుమార్ ఒక మంచి ప్రాజెక్టు చూసి ఒక కాంబినేషన్ సెట్ చేసి పెట్టారో.. అప్పుడే సూర్య ప్రతాప్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఆ సినిమా మరేదో కాదు నిఖిల్ అనుపమ పరమేశ్వర్ కాంబినేషన్ లో వస్తున్న 18 పేజెస్. ఇదిలా ఉండగా.. సూర్య ప్రతాప్ తరహాలో బుచ్చిబాబు సనా కూడా తన సొంతంగా ఏ సినిమాని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవడం లేదట. స్వయంగా సుకుమారే ఒక ప్రాజెక్టు వెతికిపెట్టిన తరువాతనే బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తారా? అనేది కాలమే చెప్పాలి కానీ ప్రస్తుతం ఈ విషయమై ఓ సందేహం ఉత్పన్నమవుతోంది. అదేంటే బుచ్చిబాబు సూర్య ప్రతాప్ అడుగుజాడల్లో నడుస్తారా లేక సుకుమార్ సామ్రాజ్యం నుంచి బయటికి వెళ్ళి తన సొంతంగా సినిమాలు డైరెక్ట్ చేసుకుంటారా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.