శాకుంతలం కోసం పారితోషికం తగ్గించుకున్నందుకు సమంతని పొగడ్తలతో ముంచెత్తుతున్న అభిమానులు...

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎన్నో లక్షల అభిమానులని సంపాదించుకుంది..ఎన్నో విజయాలు అందుకోని స్టార్ హీరోస్ హాట్ ఫేవరెట్ అయ్యింది సమంత. తరువాత సహనటుడు టాలీవుడ్ లవర్ బాయ్ నాగ చైతన్య ని పెళ్లి చేసుకోని తన వైవాహిక జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇక పెళ్లి తరువాత కూడా అంతే జోరుగా సినిమాలు చేస్తుంది. సరికొత్త కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. 'ఓ బేబీ' సినిమాతో విజయాన్ని అందుకున్న సమంత ప్రస్తుతం 'శాకుంతలం' అనే సినిమాలో నటించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఆయన కూతురు నిర్మాతగా వ్యవహరిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు.అసలు సమంత చేస్తుందో లేదో అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకొని.. సినిమాకి కీలకంగా మారింది.అయితే ఈ సినిమాకి సామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఉంటుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.



అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం సమంత రూ.2.50 కోట్లు తీసుకుందట. నిజానికి ఆమె యాభై లక్షలు తగ్గించి రెమ్యునరేషన్ తీసున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సమంత-నందిని రెడ్డి కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం.. ఈ స్టార్ హీరోయిన్ రూ.3 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేసింది.అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్ కూడా తీసుకుంది. 2022లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది.ఈ కథ తనకు చాలా నచ్చడంతో పైగా గుణశేఖర్ ప్లాపుల్లో వున్నాడని అర్ధం చేసుకోని సమంతసినిమా కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకుందట. రెమ్యూనరేషన్ తగ్గించుకున్నందుకు గాను సమంత ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సమంతని పొగడ్తలతో ముంచెత్తుతున్నారట.ఎందుకంటే ఛాన్స్ దొరికితే రెమ్యూనరేషన్ పెంచేస్తున్న ఈ రోజుల్లో సమంత ఒక అడుగు వెనకేసి పారితోషికం తగ్గించుకోవడం గ్రేట్ అని అభిమానులు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: