బోయపాటి, రామ్ సినిమా మరో వినయ విధేయ రామ అవ్వదుగా..??

Purushottham Vinay
టాలీవుడ్ ఎనర్జటిక్ స్టార్ రామ్ వరుస హిట్లతో మంచి ఫాంలో వున్నాడు. ఇక గతేడాది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన "ఇస్మార్ట్ శంకర్ " తో మాంచి మాస్ హిట్ అందుకున్న రామ్ ఈ ఏడాది  'రెడ్' లాంటి త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో కూడా రామ్ మంచి హిట్ నే అందుకున్నాడు.ఇక వరుస హిట్లు అందుకున్న రామ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన దగ్గరకి వచ్చిన చాలా కథలను రిజెక్ట్ చేశాడు. ఫైనల్ గా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లింగుస్వామితో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు.వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ ని పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాటు రామ్ తాజాగా మరో సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.


టాలీవుడ్ డైరెక్టర్ లలో ఊర మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.ఈ సినిమా తరువాత బోయపాటి.. హీరో రామ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా బోయపాటి.. ఈ యంగ్ హీరోని కలిసి కథ వినిపించారట. అది రామ్ కి నచ్చడంతో ఆయన సినిమా చేయడానికి అంగీకరించినట్లు టాక్. బాలయ్య-బోయపాటి సినిమాను నిర్మిస్తోన్న మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారని సమాచారం. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా బోయపాటి-రామ్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. రామ్.. లింగుస్వామి ప్రాజెక్ట్ పూర్తి చేసిన తరువాత బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది.అయితే రామ్ ఫ్యాన్స్ కి మాత్రం బోయపాటి సినిమాపై చాలా భయంగా వున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరో స్టేటస్ దక్కించుకున్న రామ్ బోయపాటితో సినిమా చెయ్యడం చాలా ఆందోళన కలిగిస్తుందట. ఇందుకు కారణం బోయపాటి తీసిన వినయ విధేయ రామ. బోయపాటి సినిమా ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కోసారి బాగా తీస్తాడు. ఒక్కోసారి యాక్షన్ సన్నివేశాలు ఓవర్ అయ్యి సినిమాలు బోల్తా కొడతాయి. ఇక రామ్ తో ఎలా తీస్తాడోనని రామ్ ఫ్యాన్స్ చాలా ఖంగారు పడుతున్నారట. ఒకేవేళ హిట్ అయితే రామ్ కెరీర్ లో మరో మాస్ హిట్ ఖాయం. చూడాలి మరి బోయపాటి మ్యాజిక్ ఎలా ఉంటుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: