కొద్ది నెలల గ్యాప్ లోనే రిలీజ్ కాబోతున్న తారక్ 2 సినిమాలు..

Suma Kallamadi
జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా నటించిన అరవింద సమేత వీర రాఘవ అక్టోబర్ 11, 2018 లో విడుదల అయింది. ఆ తర్వాత తారక్ దిగ్గజ దర్శకుడు రాజమౌళితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేయడం ప్రారంభించారు. ఇప్పటికే 2 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కాలేదు. ఐతే ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన 'ఆర్ఆర్ఆర్' విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. దీంతో తారక్ ఒకే ఒక్క సినిమా పూర్తి చేయడానికి 3 సంవత్సరాల సమయం తీసుకున్నట్లు అయ్యింది. మూడు సంవత్సరాల సమయం పట్టినా కూడా తారక్ కి ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ పెరుగుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


అయితే ఆర్ఆర్ఆర్ వల్ల కెరీర్ లో భారీ గ్యాప్ రావడంతో.. దాన్ని భర్తీ చేసేందుకు ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే కొద్దినెలల సమయంలోనే తన రెండు సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆయన "అయినను పోయిరావలె హస్తినకు" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. నిజానికి అయినను పోయిరావలె హస్తినకు చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి కావస్తోంది.


దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ సినిమా యొక్క షూటింగ్ త్వరగా ప్రారంభించి శరవేగంగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది వేసవి కాలం నాటికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీనితో 8 నెలల వ్యవధిలోనే తారక్ తారాగణంలో రెండు భారీ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.  'అయినను పోయిరావలె హస్తినకు' చిత్రాన్ని హరిక, హాసిన్ క్రియేషన్స్ & ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. పొలిటికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: