
వాడు నా వాడు.. స్టేజి మీదే ప్రపోజ్ చేసిన వర్ష..?
కానీ ఈ మధ్య కాలంలో మాత్రం జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జంటగా గుర్తింపు సంపాదించుకొని తమ కెమిస్ట్రీ తో బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ తమ మాటలతో బుల్లితెర ప్రేక్షకులను మురిపిస్తూ.. ప్రస్తుతం ఈ టీవీ లోని ప్రతి ఈవెంట్ లో వారే కనిపిస్తూ.. బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు జబర్దస్త్ కమెడియన్స్ ఇమాన్యుల్ వర్ష. ప్రస్తుతం వీరిద్దరి జోడి ఎంతగానో క్రేజ్ సంపాదించింది అన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందా లవ్ ఉందా అన్నది మాత్రం ప్రేక్షకులకు అంతగా క్లారిటీ రాలేదు. ఇటీవలే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది వర్ష.
అందరి ముందే తన మనస్సులో మాట బయట పెట్టేసింది. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే కెవ్వుకార్తిక్ టీం లో భాగంగా ఇమాన్యుల్ వర్ష స్కిట్ చేస్తారు. ఇక ఆ తర్వాత స్కిట్ అయిపోయాక జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తున్న సమయంలో... ఇక ఓ రోజు ఇమాన్యుల్ తనకు కాల్ చేసి ఎంతో కేరింగ్ తీసుకోవడంతో అప్పుడే ఇక ఇమ్మానియేల్ నావాడు అని అనిపించింది అంటూ మనసులో మాట బయట పెట్టేసింది వర్ష. ఆ తర్వాత తెగ సిగ్గు పడి పోయింది.