జగపతి బాబు వెబ్ సిరీస్.. ఆయనకు జోడీగా అలనాటి హీరోయిన్..!?
ఇక ఇటీవల ‘పిట్టకథలు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు జగపతి బాబు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు తెలుగు ఓటీటీ సంస్థ అయిన ‘ఆహా’ కోసం మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు జగపతి బాబు. అంతే కాదు ఈ వెబ్ సిరీస్ లో జగపతి బాబుకు జోడీగా అలనాటి అందాల నటి ఆమని కనిపించనున్నారు. ఆమని ఇటీవలే ‘చావు కబురు చాల్లాగా’అనే సినిమాలో కీలక పాత్రలో నటించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్న ఆమని ‘చావు కబురు చాల్లాగా’ మూవీలో హీరో తల్లిగా నటించారు.
అయితే జగపతి బాబు ఆమనిలది హిట్ పెయిర్. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘శుభలగ్నం’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సిరీస్ లో జగపతి బాబుకు జోడీగా నటిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో ఆమనీ బోల్డ్ గా నటించనున్నారంట. ఆహాలో త్వరలో ఆ ప్రాజెక్ట్ రాబోతున్నట్లుగా ఆమని పేర్కొన్నారు. జగ్గూభాయ్, ఆమని పెయిర్ మరోసారి సందడి చేయడం ఖాయం అని తెలుస్తుంది.