ప్రభాస్ నేను చాలా క్లోజ్.. ఫ్యాన్స్ షాక్.. చివరలో ట్విస్ట్ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..?
మంచి సినిమా తెరకెక్కిస్తే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించవచ్చు అని మరోసారి అందరికీ నిరూపించింది జాతిరత్నాలు సినిమా. అతి తక్కువ బడ్జెట్ తో ఒక సాదా సీదా సినిమాగా వచ్చిన జాతిరత్నాలు సినిమా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది . ఇక ప్రస్తుతం ఎన్ని సార్లు చూసినా అదే రకం కామెడీ ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే అటు నవీన్ పొలిశెట్టి కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా కూడా నవీన్ పోలిశెట్టి కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవలే ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి కూడా నవీన్ పోలిశెట్టి గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలోనే ఇటీవల దీనికి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. నవీన్ పోలిశెట్టి తనదైన సమాధానాలతో ఈ ప్రోమో మొత్తం రచ్చ రచ్చ చేశాడు అనే చెప్పాలి. అయితే ఈ క్రమంలో భాగంగా నీకు ప్రభాస్ తెలుసా అంటూ ప్రశ్నించగా.. అవును తెలుసు చాలా క్లోజ్.. మా మధ్య ఫ్రెండ్షిప్ ఒక లెవల్ లో క్లోజ్ గా ఉంటుంది అంటూ చెబుతాడు నవీన్ పొలిశెట్టి. దీంతో నవీన్ పొలిశెట్టి ప్రభాస్ అంత క్లోజ్ ఫ్రెండ్సా అని ఫాన్స్ షాక్ అవుతారు. అయితే ఎప్పటినుంచి ప్రభాస్ తెలుసు అంటూ అలీ అడగడంతో మొన్న ట్రైలర్ లాంచ్ నుండి తెలుసు అంటూ నవీన్ పొలిశెట్టి ఒక్కసారిగా ట్విస్ట్ ఇస్తాడు.