తెలుగు
సినిమా పరిశ్రమకు
కొరటాల శివ దర్శకత్వంలో
సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందిన
బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను ద్వారా
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన
బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ఆ విధంగా ఫస్ట్ సినిమాతో ఏకంగా
సూపర్ స్టార్ ప్రక్కన ఛాన్స్ అందుకోవడంతో పాటు దాని ద్వారా సూపర్ హిట్ సొంతం చేసుకున్న
కియారా, వాస్తవానికి అంతకముందు
బాలీవుడ్ లో
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా తెరకెక్కిన ఎమ్ ఎస్
ధోని మూవీ లో ఒక
హీరోయిన్ గా నటించి మంచి పేరు దక్కించుకుంది. అయితే ఆ మూవీలో ఆమె అందం, అభినయం ఎంతో నచ్చిన
కొరటాల, ఆపై
భరత్ అనే నేను లో
హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు.
అనంతరం మరొక స్టార్
హీరో మెగాపవర్ స్టార్
రామ్ చరణ్ సరసన
వినయ విధేయ రామ మూవీ లో ఛాన్స్ కొట్టిన
కియారా, ఊహించని విధంగా దానితో పరాజయాన్ని అందుకుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ
సినిమా సక్సెస్ కానప్పటికీ చరణ్, కియారాల ల జోడికి మంచి పేరు వచ్చింది. ఇక తరచు మిగతా నటీనటుల మాదిరిగానే తన సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకాభిమానులతో టచ్ లో ఉండే
కియారా, మధ్యలో తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా వారితో పంచుకుంటూ ఉంటారు.
ఇక మధ్యలో తాను దిగిన పలు ఫోటో షూట్స్ ఫోటోలు కూడా పోస్ట్ చేసే అలవాటున్న
కియారా ఇటీవల ప్రఖ్యాత సంస్థ ఫిలిం ఫేర్ వారి లేటెస్ట్ ఎడిషన్ లో భాగంగా దిగిన కవర్ పేజీ ఫోటోలను పోస్ట్ చేయడం జరిగింది. అందులో ట్రెండీ స్టైల్ లో వైట్ కలర్ డ్రెస్ లో
కియారా కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు రేపారనే చెప్పాలి. అబ్బబ్బబ్బా మాములు అందం అయితే ఓకే మరీ ఇంత అందం అయితే ఎలా తట్టుకోగలం అంటూ పలువురు ఫ్యాన్స్ ఆ ఫోటో పై తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!