గోనగన్నారెడ్డి పాత్రను బన్నీ కాదు.. ఆ హీరో చేయాల్సిందట..?

praveen
కొన్ని కొన్ని సినిమాలు ఎలా ఉన్నప్పటికీ ఆ సినిమాలోని కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  అలా బాగా కనెక్ట్ అయి పోయిన పాత్రలు ఎప్పుడూ గుర్తుండిపోతు ఉంటాయి. అయితే ఇలా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ పాత్రల్లో అల్లు అర్జున్ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర.  కనిపించింది కొంత సమయం అయినప్పటికీ గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. ఇక అదిరిపోయే తెలంగాణ యాస తో పాటు తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశాడు.  గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రుద్రమదేవి అనే సినిమా తెరకేక్కింది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసేలా  ఉంటుంది.  ఇక ఎప్పుడు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించే గుణశేఖర్..  రుద్రమదేవి అనే సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో బందిపోటు గోన గన్నారెడ్డి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఇక ఈ పాత్రలో ఏకంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తాడు. ప్రేక్షకులు ఊహించని గెటప్లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తెలంగాణ యాస తో ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తూ ఉంటాడు.  ఇక సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ తప్ప మరెవరు న్యాయం చేయలేరేమో అనేంతగా  అద్భుతంగా నటించాడు అల్లు అర్జున్.

 అయితే రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ నటించి ప్రశంసలు అందుకున్న గోన గన్నారెడ్డి పాత్ర కోసం ముందుగా చిత్రబృందం అల్లు అర్జున్ కాకుండా మరో హీరోని తీసుకోవాలని అనుకుందట. ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి మహేష్ బాబు తో పాటు ఎన్టీఆర్ కూడా ఎంతో ఆసక్తి చూపించారట.  ఆ పాత్ర గురించి వారికి పూర్తి అవగాహన ఉండటం వల్లే ఇలా ఆసక్తి చూపించారట. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ క్యారెక్టర్ చేయలేకపోయారట ఆ తర్వాత గోన గన్నారెడ్డి పాత్ర కాస్త అల్లు అర్జున్ కి వరించినట్లు తెలుస్తోంది. ఇక అనుష్క ప్రధాన పాత్రలో  తెరకెక్కుతున్న రుద్రమదేవి సినిమా మంచి విజయాన్ని అందుకుంది అన్న  విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: