చిరంజీవి అలసటకు మోహన్ బాబు మంత్ర !

Seetha Sailaja
చిరంజీవి మోహన్ బాబుల మధ్య ఒక సున్నితమైన గ్యాప్ ఉంది అంటూ అనేకసార్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికితోడు గతంలో అనేకసార్లు మోహన్ బాబు చేసిన కామెంట్స్ పరోక్షంగా చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ అంటూ అనేకమంది అభిప్రాయ పడ్డారు.


అయితే చిరంజీవి మాత్రం తనకు ఎప్పుడు మోహన్ బాబుతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనీ తనకు మోహన్ బాబు అత్యంత సన్నిహితుడు అంటూ అనేకసార్లు క్లారిటీ ఇస్తూనే వచ్చాడు. మళ్ళీ వీరిద్దరి సాన్నిహిత్యానికి సంబంధించిన ఒక వార్తను మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు బయటపెట్టింది.


ఈమధ్య ‘ఆచార్య’ అవుట్ డోర్ షూటింగ్ లో ఎండల వేడి తట్టుకోలేక చిరంజీవి విపరీతమైన అలసటకు లోనవ్వడంతో ‘ఆచార్య’ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నాడు. దీనితో చిరంజీవి తన ఆలసటను తగ్గించుకోవడానికి తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అనుకున్నారు అంతా. అయితే చిరంజీవి తన భార్య తో కలిసి సిక్కిమ్ రాష్ట్రానికి వెళ్ళడమే కాకుండా తన వెంట మోహన్ బాబు దంపతులను కూడ తీసుకు వెళ్ళాడట.


హిమాలయ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఆ రాష్ట్రంలోని ప్రకృతి అందాలను చిరంజీవి మోహన్ బాబు తో కలిసి గడిచిన వీకెండ్ అంతా తెగ ఎంజాయ్ చేసారని మంచు లక్ష్మి ఆ విషయాలను తెలియచేస్తూ చిరంజీవి మిహన్ బాబులు కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు తన తండ్రి మోహన్ బాబును ఒప్పించి సిక్కిమ్ కు పట్టుపట్టి తీసుకువెళ్ళిన చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేసింది. నటులుగా మాత్రమే కాకుండా ఒకప్పుడు రాజకీయాలలో కూడ వీరిద్దరూ చాల యాక్టివ్ గా కాలం గడిపారు. ప్రస్తుతం రాజకీయాలకు వీరిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ వీరిద్దరూ ఒకవైపు సిక్కిమ్ అందాలను ఎంజాయ్ చేస్తూనే తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకుని ఉంటారు. ప్రస్తుతం వీరిద్దరూ సిక్కింలో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: