మహేష్ పై పొగడ్తల వెనుక రాజమౌళి వ్యూహం !

Seetha Sailaja


‘బాహుబలి’ సృష్టికర్త రాజమౌళి మహేష్ పై చేసిన పొగడ్తల వెనుక అర్ధాలు ఏమిటి ? అంటూ ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి వేరే సినిమా డైరెక్టర్లను హీరోలను పొగడ్డానికి ఏమాత్రం సంశయించడు. 

తనకు సినిమాలు నచ్చితే చాలు చిన్న సినిమా అయినా ప్రశంసలు కురిపిస్తాడు జక్కన్న. నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘శ్రీమంతుడు’ సినిమాను రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి చూడటమే కాకుండా ఆ సినిమా పై తన ట్విటర్ లో చేసిన వ్యాఖ్యల వెనుక ఎదో ఒక అర్ధం ఉంది అంటూ కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు.

పల్లెటూరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ కు ఫ్యామిలీ సెంటిమెంటును మిక్స్ చేయడంలోనే ‘శ్రీమంతుడు’ సక్సెస్ దాగి ఉంది అని అంటూ అయితే పైసా వసూల్ చేసిందంతా మహేష్ వల్లే అంటూ మహేష్ ను ఆకాశానికి ఎత్తేశాడు రాజమౌళి. అంతేకాదు ఈసినిమాలో  మహేష్ ఎఫెక్ట్ అద్భుతం అంటూ కామెంట్ చేసాడు. 

‘బాహుబలి’ 500 కోట్ల సినిమాగా మారిన నేపధ్యంలో ఆ సినిమాలో నటించిన నటీ నటులకంటే క్రేజ్ ను ఎక్కువగా కొట్టేసిన రాజమౌళి ‘శ్రీమంతుడు’ విషయంలో మాత్రం కొరటాల శివ కంటే పైసా వసూలు హీరోగా మహేష్ ను పొగిడిన నేపధ్యంలో 500 కోట్ల వసూళ్ళ వెనుక మరి ప్రభాస్ పాత్రను మరిచిపోయాడా ? అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. ఎదో ఒకరోజు మహేష్ తో సినిమాను చేస్తానని చెపుతున్న రాజమౌళి టాలీవుడ్ టాప్ హీరోలందరిలోకి పైసా వసూలు హీరోగా మహేష్ ను పొగడటం వెనుక అసలు గుట్టు ఏమిటో రాజమౌళికే ఎరుక.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: