ఆంధ్రావాల సెటైర్లలో బాహుబలి !

Seetha Sailaja


‘బాహుబలి’ ఆడియో వేడుక జరిగి పదిరోజులు అయినా ఇంకా ఆ ఆడియో ఫంక్షన్ విషయాల పై కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఅర్ వీరాభిమానులు ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ పై కొత్తగా లేవనెత్తిన విషయాలు చూస్తూ ఉంటే మన టాప్ హీరోల వీరాభిమానుల అభిమానం ఏ స్థాయి లో రోజురోజుకు పెరిగిపోతోందో అర్ధం అవుతుంది. 

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను టెలికాస్ట్ చేసిన టివి 5ఛానల్ ఈ ఆడియో ఫంక్షన్ పై కామెంట్ చేస్తూ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఘనమైన ఆడియో ఫంక్షన్ జరగలేదు అంటూ చాల సార్లు ఆ ఛానల్ ఈ కార్యక్రమం పై కామెంట్ చేసింది. అయితే ఈ విషయాన్ని జూనియర్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి కారణం జూనియర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ‘ఆంధ్రావాలా’ ఆడియో ఫంక్షన్ అని అంటున్నారు. 2004లో విడుదల అయిన ‘ఆంధ్రావాలా’ ఆడియో ఫంక్షన్ కృష్ణాజిల్లా నిమ్మకూరులో జరిగింది. 

ఆ రోజులలోనే ఆ ఆడియో ఫంక్షన్ కు లక్షల సంఖ్యలో అభిమానులు వచ్చారని జూనియర్ అభిమానుల వాదన. అంతేకాదు ప్రత్యేక రైళ్ళలో బస్సులలో ‘ఆంధ్రావాలా’ ఆడియో ఫంక్షన్ కు అభిమానులు వచ్చిన విషయాన్ని జూనియర్ అభిమానులు గుర్తుకు చేస్తూ ఆడియో ఫంక్షన్ చరిత్రలో ‘ఆంధ్రావాలా’ రికార్డును ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ బ్రేక్ చేయలేకపోయింది అని జూనియర్ అభిమానుల వాదన.

అయితే ‘ఆంధ్రావాలా’ 2004 జనవరి 1న విడుదలై ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ విషయాన్ని జూనియర్ అభిమానులు మళ్ళీ తెరపైకి తీసుకు వస్తున్నారు అంటే ‘బాహుబలి’ కూడ అలాగే పరాజయం చెందుతుందని జూనియర్ అభిమానుల ఊహ అని అనిపించక మానదు. హీరోల పై ఉండే వీరాభిమానంతో అభిమానులు ఎటువంటి కామెంట్స్ ను చేస్తారో ఈ విషయం బట్టి ఎవరికైనా అర్ధం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: