పవన్ ను వ్యూహాత్మకంగా వాడుకుంటున్న కోన వెంకట్ !

Seetha Sailaja


పవన్ కళ్యాణ్ డైలాగులను పాటలను ఇప్పటికే ఎంతో మంది ఎన్నో విధాలుగా వాడుకుని పవన్ ను ఒక వ్యాపార వస్తువుగా మార్చివేసారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఏదో ఒక రోజు దర్శకత్యం వహించాలి అన్న కోరిక పై ఉన్న కోన వెంకట్ తాను నిర్మిస్తున్న ‘శంకరాభరణం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ  పవన్ ఈసినిమా ప్రారంభం సందర్భం గా తనకు విషెష్ చెప్పారు అంటూ ట్విట్ చేసాడు.

అంతేకాదు ఒక అధ్బుతమైన ప్రయాణానికి పవన్ ఆశీస్సులు లభించాయి అంటూ  పవన్ అభిమానుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా అప్పుడే తన సినిమాకు బయ్యర్లలో క్రేజ్ పెంచుకోవడానికి పవన్ పేరును వ్యూహాత్మకంగా వాడుకుంటున్నాడు కోన వెంకట్.

‘స్వామిరారా’, ‘కార్తీకేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రాలతో నటించి యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నిఖిల్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కోనవెంకట్  ఉద‌య్ నంద‌న‌వ‌నం అనే యువకుడిని దర్శకుడి గా పరిచియం చేస్తున్నాడు.  

బీహార్ క్రైమ్ ప్రపంచం నేపధ్యం లో నిర్మాణం అవుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన నందిత పాటు అంజలి కుడా ఒక ప్రముఖ ప్రాత్రలో నటిస్తోంది ఈ సినిమా ఈ రోజు మహరాష్ట్రలోని బోర్ అనే మారు మూల గ్రామంలో ప్రారంభం అవుతూ ఉండటంతో ఈ ఫిస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. యంగ్ హీరోలు దేముడుగా ఆరాధించే పవన్ ఆశీర్వాదాలు ఎత వరకునిఖిల్ కు అదేవిధంగా కోన వెంకట్ విజయానికి సహకరిస్తాయో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: