ఎక్స్ పోజింగ్ పై రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja


టాలీవుడ్ మోస్ట్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఎక్స్ పోజింగ్ పై చేసిన వ్యాఖ్యలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాయి. ఈనెల 29న విడుదల అవుతున్న రామ్ ‘పండుగ చేస్కో’ సినిమా ప్రమోషన్ నిమిత్తం మీడియా ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ ఎక్స్ పోజింగ్ పై ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ గ్లామరస్ గా కనిపించడానికి ఏకైక మార్గం ఎక్స్ పోజింగ్ మాత్రమే అనుకుంటున్నారని అయితే గ్లామర్ వేరు ఎక్స్ పోజింగ్ వేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తాను గ్లామర్ గా కనిపించడానికి ప్రయత్నిస్తాను కాని ఎక్స్ పోజింగ్ మాత్రం చేయనని అలా ఎక్స్ పోజింగ్ చేసే హీరోయిన్స్ సినిమాలు తాను కూడ తన తల్లి తండ్రులతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తానని చెప్పింది. 

అయితే రకుల్ నోటి వెంట ఎక్స్ పోజింగ్ చేయను అని మీడియా సాక్షిగా మాటలు రావడం మీడియా ప్రతినిధులను ఆశ్చర్య పరిచింది. ఈమధ్య జరిగిన ‘పండుగ చేస్కో’ ఆడియో ఫంక్షన్ కు తన బ్యాక్ పార్ట్ అంతా చూపెడుతూ హడావిడి చేసిన రకుల్ డ్రస్ ఎక్స్ పోజింగ్ అనుకోవాలా లేక గ్లామర్ అనుకోవాలా అనే విషయం మీడియా ప్రతినిధులకే అర్ధం కాక ఆమె పై జోక్స్ పడ్డాయని తెలుస్తోంది. 

ఎన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అన్నది కాదు ఎన్ని సినిమాలు చేయగలిగాము అన్నది ముఖ్యం అంటూ మహేష్ పంచ్ డైలాగ్స్ ను పోలిన మాటలు చెపుతూ ఉన్న రకుల్ ఈనాటి టాపిక్ ఆఫ్ టాలీవుడ్. ఒక వైపు టాప్ యంగ్ హీరోలు అంతా రకుల్ వెంట పడుతూ ఉండటంతో కోటి రూపాయల పారితోషికం కొండ పై  కూర్చున్న  రకుల్ ప్రీత్ కు  ఎక్స్ పోజింగ్ కు గ్లామర్ కు తేడా తెలియకుండా ఇలా మాట్లాడటం ఆమె అమాయకత అనుకోవాలో లేదా అతి తెలివితేటలు అనుకోవాలో ఆమెకే తెలియాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: