పవన్ కళ్యాణ్ విజయ రహస్యం వెనుక రవితేజ ప్రేరణ !

Seetha Sailaja


పవన్ కెరియర్ కు మరోసారి మలుపుతిప్పిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఘన విజయం వెనుక మాస్ మహారాజ రవితేజ ప్రేరణ ఉంది అంటూ కొన్ని ఆ శక్తికర విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ఈ విధంగా ఈ కామెంట్స్ రావడానికి గల కారణం రవితేజాతో సూపర్ హిట్స్ తీసిన దర్శకులు ఆ తరువాత పవన్ సినిమాలకు దర్శకులుగా మారడం వల్ల ఈ ఆశక్తికర కామెంట్స్ వినపడుతున్నాయి.

ఇక వివరాలలోకి వెళితే పవన్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ రవితేజాతో ‘మిరపకాయ్’ సినిమా తీసిన తరువాత పవన్ ‘గబ్బర్ సింగ్’ కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అదే విధంగా ప్రస్తుతం పవన్ తో ‘గబ్బర్ సింగ్ 2’ తీయడానికి పరిస్థుతులకు ఎదురీది పోరాటం చేస్తున్న దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబి) కూడ రవితేజాతో ‘పవర్’ సినిమాను తీసిన తరువాత మాత్రమే ‘గబ్బర్ సింగ్ 2’ కు అదృష్టం కలిసి వచ్చింది.

దీనితో ఎలా చూసుకున్నా రవితేజ హస్తం లేకుండా దర్శకులకు పవన్ దగ్గర అవకాశాలు రావు అంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఈ విశ్లేషణలు ఇలా ఉంటే ‘గబ్బర్ సింగ్ 2’ కు ఈ నెలాఖరున మే 29 నుంచి షూటింగ్ ముహూర్తం కుదిరింది అంటూ మరోసారి ప్రచారాలు ఊపు అందుకున్నాయి.

అయితే ఈ వార్తలు ఎంత వరకు వాస్తవ రూపానికి వస్తాయి అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా పవన్ అభిమానులకు ‘గబ్బర్ సింగ్ 2’ కు సంబంధించి మరోసారి ఎడారిలోని ఒయాసిస్సులా ఈ వార్తలు ఆశలను రేకెత్తిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: