బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ని వదులుకొని అవకాశాల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..!!
హీరోయిన్ అనుఇమ్మాన్యుయేల్ గీతా గోవింద మూవీ లో గెస్ట్ రోల్ లో అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట గీతా గోవిందం మూవీ కి హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ అని అడిగాడట డైరెక్టర్ పరుశురాం కానీ ఆమె నో చెప్పింది. అందుగల గల కారణం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “నా పేరు సూర్య” సినిమాతో బిజీగా ఉండటం, ఇక అప్పటికే ‘శైలాజా రెడ్డి అల్లుడు’ మూవీ కూడా కమిట్ అయి ఉండటం వల్ల బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ‘గీత గోవిందం’ లో నటించలేక పోయిందట. ఈ మూవీ చేయలేకపోవడం వల్లే టాలీవుడ్ లో అవకాశాలు దక్కలేదని తెగ బాధ పడుతోందట ఈ బ్యూటీ హీరోయిన్. టాలీవుడ్ లో దాదాపు 100 కోట్లు షేర్ సాధించిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. అనూ ఇమాన్యుల్ ఈ మూవీని చేసి ఉంటే టాలీవుడ్ లో ఇప్పటికీ బిజీ హీరోయిన్ అయి ఉండేదని ఫిలిం ఇండస్ట్రీ టాక్.
ఇటీవల విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో గ్లామర్ పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ కమర్షియల్ గా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’ లో అను హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ కేరళ బ్యూటీ ఈ మూవీ పైచాలా ఆశలు పెట్టుకుందట. ఇక ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించి రాణిస్తుందో వేచి చూడాలి మరి