చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్.. ఫాన్స్ షాక్..?
ఇక ఇటీవల క్రాక్ సినిమాతో రవితేజ తో కలిసి తెలుగు తెరకు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరిన్ని బంపర్ ఆఫర్లు కొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలావుంటే ఇటీవల శృతి హాసన్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా మనం హీరోయిన్లు సినిమాల్లో చూసిన సమయంలో ఇక సినీ హీరోయిన్లు ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటూ ఉంటాం.
కానీ సినిమా హీరోయిన్లు కూడా సాదారణ మనుషులే కాబట్టి వారు కూడా అందరిలాగానే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే శృతి హసన్ కూడా చిన్నతనం నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తనకి యాంగ్జైటీ డిజార్డర్ ఉందట. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని చాలా సంవత్సరాలుగా యాంగ్జైటీ తో బాధ పడుతున్నా అని చెప్పుకొచ్చింది. ఎన్నో రోజుల పాటు ఒక రకమైన యాంగ్జైటీ తో బాధపడుతున్నా అని.. ఆందోళన రుగ్మత తో బాధపడుతూ ఉన్నాను అన్న విషయాన్ని 30 ఏళ్ళు వచ్చిన తర్వాత గుర్తించా అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. దీని కోసం చికిత్స తీసుకుంటున్నా అంటూ తెలిపింది.