గాంధీ కూడా పురుషుడే అందుకే.. కంగనా సంచలన వ్యాఖ్యలు..?

praveen
ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీ కంగనా రనౌత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కంగనారనౌత్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ రేంజ్  సంపాదించింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులు అందరి మతి పోగొట్టి  హాట్ హాట్ గ్లామర్ పాత్రల్లో నటించాలని అన్న.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి విమర్శకులను సైతం మెప్పించి ప్రశంసలు అందుకోవాలి అన్న కూడా కంగనా  రనౌత్ కే సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో క్రేజ్ సంపాదించిన కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడే కంగనారనౌత్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఇక కంగనా రనౌత్ ఏమైనా వ్యాఖ్యలు చేసింది అంటే చాలు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా కంగనారనౌత్ కి పేరు ఉంది.



 ఇక ఇటీవలే తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది కంగనారనౌత్. ఇక ఈసారి రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం కాదు ఏకంగా జాతిపిత మహాత్మా గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గాంధీజీ తన సొంత బిడ్డలను వేధించారు..  ఇక అతిథుల టాయిలెట్లు కడగలేదని ఏకంగా కట్టుకున్న భార్యను ఇంట్లోనుంచి పంపేశారు అన్న కథనాలు కూడా ఉన్నాయి.. అయినప్పటికీ గాంధీ గొప్ప నాయకుడు అయ్యారు. ఒక మంచి భర్త ఒక మంచి తండ్రి కాకపోయినప్పటికీ గాంధీ మంచి నాయకుడు అయ్యారు దీనికంతటికీ కారణం అప్పటి పురుషాధిక్య సమాజమే అంటూ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఇది  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: