యాంకర్ రష్మి ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా...?
జబర్దస్త్ షో కి వచ్చిన తర్వాత ఈమెకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి... పలు చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది . ఇక ఈమె మొట్టమొదటిగా హీరోయిన్ గా చేసిన సినిమా...కందేన్ అనే తమిళ చిత్రం. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఈ అవకాశాన్ని ఈమెకు హీరోయిన్ సంగీత ద్వారా దక్కింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ రష్మిక మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రష్మీ నటనకు మంచి గుర్తింపు దక్కుతోంది కానీ... ఈమెకు దశ తిరిగే రేంజ్ లో అవకాశాలు మాత్రం అందడం లేదు.
ప్రస్తుతం రష్మి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్. హీరో నందుతో కలసి ఈ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ జబర్దస్త్ హాట్ యాంకర్. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం తో నైనా రష్మీ సుడి తిరుగుతుందేమో చూడాలి. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సమ్వత్సరాలు అయినా ఇంకా నిలదొక్కుకోలేక పోవడం రష్మీ దురదృష్టం అనే చెప్పాలి. భవిష్యత్తులో అయినా మంచి పాత్రలు వచ్చి మంచి హీరోయిన్ గా కొనసాగాలని కోరుకుందాము.