'జాతిరత్నాలు'లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన స్టార్ యాక్టర్స్..!
హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ 'జాతిరత్నాలు' సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారట. ఫస్ట్ హాఫ్ లో కీర్తి సురేష్ కనిపించి సందడి చేయగా... సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ ఇచ్చారు. దర్శకుడు కం నిర్మాత నాగ్ అశ్విన్ తో వీరిరువురు చాలా క్లోజ్ అన్న విషయం తెలిసిందే... ఇప్పుడు అదే చనువుతో జాతి రత్నాలు సినిమా లో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నిర్మాత. ఈ పాయింట్ సినిమాకి మరింత హైలెట్ ను తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే.... ఈ చిత్రంలోని సన్నివేశాలను రియాలిటీకి దగ్గరగా చూపిస్తూ ఎంటర్టైన్మెంట్ ను ఫుల్ గా యాడ్ చేశాడు డైరెక్టర్.
మొత్తంగా చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మెసేజ్ తో పాటు... ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడీ ని అందించిన చిత్రం జాతిరత్నాలు. యూత్ తో పాటు ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయగల చిత్రమనే చెప్పొచ్చు. ఇకపోతే నవీన్ పోలిశెట్టి...ప్రియదర్శి..రాహుల్ రామకృష్ణ... అదే విధంగా హీరోయిన్ పోటాపోటీగా నటించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడి పనితీరును కూడా మెచ్చుకోక తప్పదు.