కంగనా రనౌత్ ఆ డైరెక్టర్ గురించి మాట్లాడింది నిజమేనా...?

VAMSI
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిగా ఎంత పేరు తెచ్చుకున్నారో.. అంతకంటే ఎక్కువగా విమర్శలతో హైలెట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ విమర్శలు మరియు వివాదాలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కంగనా రనౌత్... ఇప్పుడు తాజాగా ఓ డైరెక్టర్ ని  పొగుడుతూ ... ఆయనను ప్రశంసలతో ముంచెత్తింది. ప్రశంసించడం వరకు సరే ఏకంగా ఆ దర్శకుడి ని దేవునితో పోల్చడం విశేషం. కంగనా చేత ప్రశంసించబడ్డాడు అంటే ఆ వ్యక్తి నిజంగా ఎంతో గొప్ప వారు అంటున్నారు ఈ వార్త విన్న నెటిజన్లు.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..తమిళ డైరెక్టర్ విజయ్. కంగనా ప్రధాన పాత్రలో, విజయ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ చిత్రం  'తలైవి'. తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోపిక్ ఇది. ఈ సినిమాలో   జయలలిత పాత్రలో కనిపించనున్నారు కంగనా. అందులో BAGAMGAAభాగం ఈ సినిమా షూటింగ్  సమయంలో డైరెక్టర్ విజయ్ వైఖరిని గమనించిన కంగనా... ఆయన నడవడిక, ఇతరులతో ఆయన మెలిగే శైలి, ఎప్పుడు చిరునవ్వుతో పని చేసుకు పోయే తత్వం.. ఇలా ఒకటేమిటి ఎన్నో విశేషాలను గురించి విజయ్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్టు పెట్టింది కంగనా.

ఎప్పుడూ కౌంటర్ల తో ఎటాక్ చేసే కంగనా రనౌత్... ఇలా మొదటి సారి ఓ వ్యక్తిని అమాంతం ఆకాశానికి ఎత్తేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఆమె ఏం చెప్పుకొచ్చిందంటే, మీరు వైన్ మాంసాహారానికే కాదు.. పార్టీలు టీ కాఫీ జోలికి కూడా అసలు వెళ్ళని వ్యక్తి. మీరు అద్భుతమైన, అరుదైన వ్యక్తి అని నేను చాలా తొందరగా గుర్తంచాను. షూటింగ్ సమయంలో కూడా ఏ ఒక్కరోజు  మీపై తక్కువ భావం కలగలేదు.'' అంతేకాదు ఏ సందర్భంలోనూ  కొంచెమైనా కోపం అభద్రతా భావాన్ని నేను చూడలేదు. మీరు మనిషి కాదు దేవుడు. హృదయపూర్వకంగా చెబుతున్నా.. ఐ మిస్ యూ'' అని డైరెక్టర్ విజయ గురించి పోస్ట్  లో రాసుకొచ్చారు కంగనా. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: