చెర్రీ రిజెక్ట్ చేసిన సినిమాకి బన్నీ ఓకే చెప్పారా..
ఇదిలా ఉండగా గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసి ఒక స్క్రిప్ట్ వినిపించారట. కానీ చరణ్ గౌతమ్ వినిపించిన స్క్రిప్ట్ కి సానుకూలంగా స్పందించలేదట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన శంకర్ తో కలిసి ఒక ప్యాన్ ఏషియా మూవీ చేయనున్నారు. ఒకటి, రెండు చిత్రాలు తెరకెక్కించిన దర్శకులతో ఆయన మూవీ చేసే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుందనే సెంటిమెంటు బలంగా ఉంది. అందువల్ల ఆయన కేవలం స్టార్ డైరెక్టర్లతో కలసి కథాబలం ఉన్న సినిమాల్లో నటించడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే గౌతమ్ తన చేత పట్టుకొచ్చిన స్క్రిప్ట్ కి చెర్రీ ఓకే చెప్పలేదని తెలుస్తోంది.
అయితే గౌతమ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథను అల్లు అర్జున్ కి వినిపించనున్నారని సమాచారం. మరి అల్లు అర్జున్ చెర్రీ రిజెక్ట్ చేసిన కథకి ఓకే చెప్తారా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకవేళ బన్నీ కి కథ నచ్చితే గౌతమ్ తో కలిసి ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గౌతమ్ రామ్ చరణ్ కోసం ఒక స్క్రిప్ట్, బన్నీ కోసం మరొక స్క్రిప్టు ప్రత్యేకంగా రాసుకున్నారని.. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ ని బన్నీకి వినిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా మెగా హీరోతో సినిమా చేసే అదృష్టం గౌతమ్ ని వరిస్తుందో లేదో చూడాలిక.