అన్నాత్తే షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్...!
హైదరాబాద్‌లోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేరుగా చెన్నై వెళ్ళిన రజనీ.. అక్కడే రెస్ట్ తీసుకుని ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఇకపై బ్రేక్ లేకుండా సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు డైరెక్టర్ శివ కు ఫోన్ కాల్ చేసి మరీ తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారట. దీంతో దర్శకుడు శివ షూటింగ్ కి కావాల్సిన కార్యక్రమాలను చక చకా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. చిత్రంలో నటిస్తున్న మిగిలిన నటీనటులకు షూటింగ్ షెడ్యూల్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రముఖ దర్శకుడు శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో... నయనతార రజనీకాంత్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, సిమ్రాన్ కూడా నటిస్తుండడం విశేషం. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకోగా.... మిగిలిన షూటింగ్ ఇప్పుడు శర వేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్. ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ 4, 2021న ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. మరి అతి త్వరలోనే ఈ సినిమా పూర్తయ్యి మన ముందుకు రావాలని కోరుకుందాం.