ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఈ సారి ఆ సీనియర్ హీరోయిన్‌ తీసుకొస్తున్నాడా..!?

N.ANJI
తెలుగును చిత్ర పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. త్రివిక్రమ్ సినిమా సినిమాకు సీనియర్ హీరోయిన్ ని తీసుకొస్తాడు. ఇప్పుడు ఇదే దారిలో మరో సీనియర్ బ్యూటీని కూడా తీసుకొస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు.. అన్షు అంబానీ. మన్మథుడు సినిమాతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మన్మథుడు విడుదలైన తర్వాత ఈమె గురించి చాలా మంది హీరోలు ఆరా తీసారు కూడా. వెంటనే ప్రభాస్ హీరోగా వచ్చిన రెండో సినిమా రాఘవేంద్రలో కూడా ఈమె నటించింది.

ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసింది అన్షు. ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ ఉన్నట్లుండి తెలుగు సినిమాలకు దూరం అయిపోయింది అన్షు. ఎక్కడుందో.. ఏం చేస్తుందో అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అంత సీక్రేసీ మెయింటేన్ చేసింది అన్షు. కొన్ని కన్నడ సినిమాలు చేసిన తర్వాత లండన్ వెళ్లిపోయింది ఈమె.  ఫ్యాషన్ డిజైనర్‌గా అక్కడ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది అన్షు. లండన్‌లో ఈమెకు ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ కూడా ఉంది. బాలీవుడ్ హీరోయిన్లతో పాటు మన హీరోయిన్లు కూడా వేసుకునే దుస్తులకు అక్కడ డూప్లీకేట్ చేసి అమ్మకాలు చేస్తారని తెలుస్తుంది.

ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిపోయింది అన్షు. చేసింది రెండు మూడు సినిమాలే అయినా కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు అన్షు మళ్లీ తెలుగు సినిమాల్లోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమాలో ఈమె హీరో అక్క పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నదియా, ఖుష్బూ, టబు లాంటి సీనియర్ హీరోయిన్‌లను తన సినిమాల్లో చూపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు అన్షును కూడా ఇదే దారిలో తీసుకొస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఏదేమైనా కూడా అన్షు కానీ మళ్లీ నటించిందంటే మాత్రం కచ్చితంగా బిజీ అయిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: