ఆ హీరో ఫొటోస్ ని తన గది మొత్తం నింపుకున్న శ్రద్ధ కపూర్....

Purushottham Vinay
బాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి హిట్లు సాధిస్తూ బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.ఆషికి 2 సినిమా ద్వారా పరిచమైన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో దేశవ్యాప్తంగా యూత్ లో మంచి క్రేజ్ ని ఇంకా పాపులరిటీని సాధించింది. ఇక సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ హాట్ బ్యూటీ..అలాగే సోషల్ మీడియాలోనూ ఎక్కువమంది ఫ్యాన్స్ ని సంపాదించుకొని ఎక్కువ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ వున్న హీరోయిన్ గా సాగుతుంది. ఇక ప్రస్తుతం నెంబర్ ఒన్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో ఎకువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ శ్రద్ధాకపూర్ అని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.


అయితే శ్రద్ధాకపూర్ తన రెమ్యునరేషన్ గురించి స్పందిస్తూ నటికి ఉన్న డిమాండ్ ను బట్టి రెమ్యునరేషన్ ఇస్తారని.. తాను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటానో ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఒక సందర్భంలో చెప్పారు.అక్కడ చదువుకునే సమయంలోనే శ్రద్ధాకపూర్ పార్ట్ టైమ్ జాబ్ చేశారు. చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే శ్రద్ధాకపూర్ కు ఆసక్తి ఎక్కువ. టైటానిక్, గాడ్ ఫాదర్ సినిమాలను ఆమె ఎక్కువసార్లు వీక్షించారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన కహోనా ప్యార్ హై సినిమా అంటే శ్రద్ధాకపూర్ కు ఎంతో ఇష్టం.ఈ సినిమా విడుదలైన సమయంలో శ్రద్ధాకపూర్ ఏ పేపర్ లో హృతిక్ ఫోటోలు కనిపించినా ఆ ఫోటోలను కత్తిరించి బెడ్ రూమ్ లోని గోడలకు అతికించేవారు. అలా చేయడం వల్ల గది మొత్తం హృతిక్ ఫోటోలతో నిండిపోయిందని శ్రద్ధాకపూర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: