అల్లరి నరేష్ ఏం చేయబోతున్నాడో తెలుసా...?

NAGARJUNA NAKKA
టాలీవుడ్ లో కామెడీ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో.. అల్లరి నరేష్ . గత ఎనిమిదేళ్లుగా హిట్టే లేని నరేష్ కు ఇంతకాలానికి నాంది రూపంలో సాలిడ్ హిట్ వచ్చిపడింది. అందులోనూ ఈ సినిమాలో నరేష్ చేసిన రోల్ పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కావడంతో హిట్ తో పాటు పేరును తెచ్చిపెట్టింది. ఆ ఇదితో ఇకపై ప్రయోగాలు చేయాలని డిసైడ్ అయ్యాడు.
అల్లరి నరేష్ ప్రయోగం చేయడం ఇక్కడ సమస్యకాకపోయినా..ఆ ప్రయోగాలు చేయడానికి కావల్సిన కంటెంట్ దొరకడం చాలా ఇబ్బందే. అంటే కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలింస్ ను డీల్ చేసే యువదర్శకులు నరేష్ దగ్గరకి వస్తేనే అది వర్కవుట్ అవుతుంది. టాలీవుడ్ లో శర్వా, నాని, శ్రీవిష్ణు లాంటి హీరోలు ఉండగా వారిని వదిలి అల్లరి నరేష్ దగ్గరికి కంటెంట్ పట్టుకు వచ్చే దర్శకులు ఎంతమంది. అలా వచ్చేవారిలో ఎంతమంది వర్త్ బుల్లో చూసుకోవాలి. మరి ఇవన్నీ చూసుకుని సినిమాలు చేస్తే అన్ని చిత్రాలకు నాందికి వచ్చినట్లు పాజిటివ్ రెస్సాన్స్ వస్తుందని చెప్పలేం.ఒక విధంగా చెప్పాలంటే కామెడీ జోనర్ కంటే ఇది మరింత రిస్కీ జోన్.
నాంది హిట్ తో నరేష్ తో క్లోజ్ గా ఉంటే హీరోలందరు కట్టకట్టుకుని మరీ వచ్చి మనోడికి సపోర్ట్ చేయడం,హిట్ పడిందని విష్ చేయడం చేస్తున్నారు. రేపు ఇదే నరేష్ వారి జోనర్ చిత్రాలను టచ్ చేసి హిట్లు కొడితే ఇంతలా ముందుకు వచ్చి
విషెష్ చెబుతారా అంటే అదీ డౌటే. ఎందుకంటే నరేష్ సపోర్ట్ చేస్తున్న హీరోలందరు పర్ ఫార్మన్స్ జోనర్ చిత్రాలు చేసే కథానాయకులే. దీనికి తోడు టాలీవుడ్ లో కంటెంట్ ఫిలింస్ చేసే దర్శకులు, అప్ కమింగ్ డైరెక్టర్స్ కు కొందరు టార్గెటెడ్ హీరోలున్నారు.వారి డేట్స్ కోసం రెండు మూడేళ్లు వెయిట్ చేస్తారు. అంతేకాని నరేష్ కోసం తమ స్టోరీలు మార్చుకుంటారని గ్యారెంటీ లేదు.మరి ఈ లెక్కలన్నీ వేసుకున్నాకనే నరేష్ నెక్స్ట్ స్టెప్ ఉంటుందనుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: