చెక్ కు రకుల్ సహాయ నిరాకరణ !

Seetha Sailaja
మూడు సంవత్సరాల క్రితం వరకు రకుల్ ప్రీత్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసింది. సమంత కాజల్ తమన్నా అనుష్క ల స్థాయిలో ఆమె పారితోషికం కూడ చాల భారీగా ఉండేది. అలాంటి రకుల్ క్రేజ్ ఒక్కసారి తగ్గిపోవడంతో ఆమెను టాప్ హీరోలు కూడ పక్కకు పెట్టేసారు.


ముఖ్యంగా పూజ హెగ్డే రష్మిక ల దాటికి ఈమె తట్టుకోలేకపోయింది. దీనికితోడు వరస పరాజయాలు కూడ ఆమెను వెంటాడాయి. ‘మన్మధుడు 2’ ఫెయిల్యూర్ తో ఆమె హవా పూర్తిగా మసకబారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో నితిన్ ‘చెక్’ మూవీలో ఆమె మెయిన్ హీరోయిన్ గా ఎంపిక కావడంతో ఈ మూవీతో మళ్ళీ రకుల్ హవా మొదలవుతుంది అని భావించారు అంతా.


ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కానీ అదేవిధంగా ఈమూవీ ప్రమోషన్ కోసం ఛానల్స్ ప్రసారంచేస్తున్న ఇంటర్యూ లో కానీ రకుల్ ఎక్కడా కనిపించక పోవడం చాలామందికి ఆశ్చర్యం వేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లో రకుల్ ప్రీత్ ను ఎందుకుపక్కకు పెట్టారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ మూవీ కథలో రకుల్ ప్రీత్ పాత్ర చాల కీలకం ఇలాంటి మంచి మూవీ ప్రమోషన్ ను రకుల్ ప్రీత్ ఎందుకు వదులుకుందో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.


ఇండస్ట్రీలో వినపడుతున్న గుసగుసల ప్రకారం ఈ మూవీ దర్శకుడు చంద్ర శేఖర్ ఎలేతికి రకుల్ ప్రీత్ కు ఓకే చిన్న విషయంలో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా రకుల్ ఈమూవీ ప్రమోషన్ కు దూరంగా ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. అయితే మరికొందరు మాత్రం రకుల్ ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ లో చిక్కుకోవడంతో రకుల్ ఈ మూవీ ప్రమోషన్ కు దూరంగా ఉంది అంటూ ఆమె వస్తున్న గాసిప్పులను ఖండిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా రకుల్ సహాయ నిరాకరణ ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రియా వారియర్ కు అదృష్టంగా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: