నితిన్ చెక్ సినిమా హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలంటే...???

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ యంగ్ హీరో యూత్ స్టార్ నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు.ఈ సారి కొత్త కథతో ఎంతో ప్రయోగాత్మకమైన చెక్ సినిమాతో అంతకంటే హై రేంజ్ లో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్టవ్వాలని విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కూడా చాలా బలంగా కోరుకుంటున్నాడు. ఇక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని రకుల్ తో పాటు ప్రియా ప్రకాష్ కూడా బలంగా కోరుకుంటోంది.అయితే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నితిన్ తన సినిమాకి వున్న వసూళ్ల టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తోంది. చెక్ ట్రైలర్ రిలీజ్ అయ్యిన దగ్గర నుంచి ఈ సినిమాపై మొదటి నుంచి కూడా హిట్ అవ్వడం ఖాయంలా జనాల నుంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.



ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో యూ ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఏపి, తెలంగాణాలో సినిమా 15కోట్ల వరకు బిజినెస్ చేస్టసున్నట్లు ఇండియా హెరాల్డ్ వారికి సమాచారం అందింది.ఇక కర్ణాటక, ఓవర్సీస్..రెస్ట్ ఆఫ్ ఇండియా.. మొత్తం 1.1కోట్ల వరకు ధర పలికింది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 16.10కోట్ల బిజినెస్ చేస్తోంది. ఇక చెక్ సక్సెస్ కావాలి అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5కోట్లను రాబట్టాలి. నితిన్ గత హిట్ సినిమాలు అందించిన లాభాలను పరిగణలోకి తీసుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని తెలుస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: