ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రముఖ కన్నడ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు దివంగత నటుడు చిరంజీవి సర్జా తమ్ముడు ధృవ్ సర్జా హీరోగా నటించిన సినిమా "పొగరు" నంద కిషోర్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హాట్ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది..ఇక ఈ సినిమాని డి.ప్రతాప్ నిర్మించాడు.ఇక ఈ సినిమాకి చందన్ శెట్టి, అర్జున్ జన్యలు సంగీతం అందించారు. వీరి సంగీతంలో రూపొందిన ‘కరాబు మైండు కరాబు’ అనే ఒక్క పాట..యూ ట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యి ఈ డబ్బింగ్ సినిమా పై అందరి దృష్టి పడేలా చేసింది.ముఖ్యంగా ఈ పాటలో రష్మిక మందన ఉండటంతో ఈ పాటని నెటిజన్స్ విపరీతంగా ఆదరించారు. అందువల్ల భారీ అంచనాలతో ఈ సినిమా రూపొందింది కానీ ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడంలో విఫలమయ్యింది.అయినప్పటికీ రష్మిక వంటి హాట్ స్టార్ హీరోయిన్ క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ నే నమోదు చేసింది.
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ‘పొగరు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.74 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 2.46 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఓ డబ్బింగ్ సినిమాకి ఈ ఓపెనింగ్స్ చాలా ఎక్కువే. కానీ ఎక్కువ రేట్లకు కొనుగోలు చేశారు కాబట్టి.. వీక్ డేస్ లో కూడా బాగా రాణించాల్సి ఉంటుంది.కానీ నెగిటివ్ టాక్ తో అది సాధ్యమవుతుంది అనేది చెప్పలేము.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...