బాలకృష్ణ కోసం రవితేజ ఫార్ములా !

Seetha Sailaja
చిరంజీవి నాగార్జున వెంకటేష్ ల దూకుడు చూసి బాలకృష్ణ కూడ తన స్పీడ్ పెంచుతున్నాడు. బోయపాటితో చేస్తున్న మూవీ ఇంకా పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలకు బాలయ్య లైన్ క్లియర్ చేసాడు. బుర్రా సాయి మాధవ్ వ్రాసిన ఒక పవర్ ఫుల్ కథ బాలయ్యకు నచ్చడంతో ఆమూవీని ఒకప్పుడు ‘నరసింహనాయుడు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బి. గోపాల్ కు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు.

ఇప్పటికే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేయడానికి అంగీకరించిన పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈమూవీ కూడ ‘క్రాక్’ సినిమా విధంగా ఒక యదార్థ సంఘటన ఆధారంగా తయారు చేసిన కథ అని అంటున్నారు.  ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్న ఈ మూవీ కోసం ఒక పవర్ ఫుల్ టైటిల్ ను అన్వేషిస్తున్నారు. ఈ వేసవిలోనే సెట్స్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో కూడ శ్రుతిహాసన్ బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా ఎంపిక అయ్యే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.

మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీని బాలయ్య మార్కెట్ ను దృష్టిలో పెట్టుకోకుండా భారీ బడ్జెట్ తో నిర్మించి అతడి మార్కెట్ ను పెంచాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఈ మూవీలో నటిస్తూనే మరొక వైపు బి. గోపాల్ మూవీ ప్రాజెక్ట్ ను కూడ మొదలుపెట్టి ఈ రెండు సినిమాలను ఒకేసారి పరుగులు తీయించాలని బాలయ్య తన యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి బాలయ్య మార్కట్ బాగా ఉండకపోయినప్పటికీ ఆమూవీకి మంచి ఆఫర్స్ బయ్యర్ల నుండి వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. దీనితో ఈ మూవీ పై ఏర్పడిన అంచనాలతో మళ్ళీ బాలయ్య ట్రాక్ లోకి రావడం అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: