ఆ బందుత్వాన్ని ఉపయోగించుకుంటున్న చెక్ !
ఇలాంటి పరిస్థితులలో ఈ వారం విడుదల కాబోతున్న ‘చెక్’ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రమోషన్ ను ఒక వారం రోజులు ముందే మొదలుపెట్టి నితిన్ ఈ సినిమాకు హైక్ తీసుకు రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. చెస్ ప్లేయర్ గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి ఉరి శిక్ష పడిన ఖైదీగా ఎందుకు మారాడు అనే పాయింట్ చుట్టూ ఈమూవీ కథ అల్లబడింది.
ఈమూవీలోని సీన్స్ చాలామటుకు జైలు నేపధ్యంలో ఉంటాయి కాబట్టి ఈ మూవీ కోసం 2 కోట్లు ఖర్చుపెట్టి భారీ జైలు సెట్టు వేసారని నితిన్ అంటున్నాడు. ‘భీష్మ’ మూవీ తరువాత నితిన్ నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ బిజినెస్ బాగా జరిగింది అని వార్తలు వస్తున్నాయి. ‘చెక్’ అనేది జైలు శిక్ష సమయంలో చెస్ ఆడిన ఒక అమెరికన్ ఖైదీ కథ అని అంటున్నారు. ప్రయోగాలు చేయడంలో మంచి పేరున్న చంద్రశేఖర్ ఏలేటి ఈ మూవీలోని సీన్స్ ను చాల బాగా తీసాడు అని అంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో నటించగా రెండవ కథానాయికగా ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగడంతో ఈ మూవీ పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. రాజమౌళికి చంద్రశేఖర్ ఏలేటి కి స్నేహంతో పాటు బంధుత్వం కూడ ఉంది అంటారు. ఈ రెండు కారణాలతో రాజమౌళి సపోర్ట్ కూడ ఈ మూవీకి ఉండటంతో నితిన్ కు మరో హిట్ తగలచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి..