వెంకటేష్ ని విక్టరీ గా నిలబెట్టిన సినిమాలు ఏంటో తెలుసా..!

Divya
సినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా అడుగుపెట్టి, విక్టరీ లెవెల్ కి ఎదిగిన వెంకటేష్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనలేని స్థానానికి చేరుకున్నాడు.  ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత,  అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కొడుకు.  ఇప్పటివరకు దాదాపు 70 సినిమాలకు పైగా నటించి, 7 నంది అవార్డులు కూడా అందుకున్నాడు. విక్టరీ వెంకటేష్ తన చిత్రాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో ఫరా,టబు, దివ్యభారతి,గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలీ జువేరి లాంటి ఎంతో మంది హీరోయిన్లు వెంకటేష్ ద్వారా తెలుగులో పరిచయం అయ్యారు. ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు ఏంటో తెలుసుకుందాం..


1.  కలిసుందాం రా:
2000 సంవత్సరంలో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథా చిత్రం కలిసుందాం రా. ఈ చిత్రంలో సిమ్రాన్, వెంకటేష్ జంటగా నటించి, బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించడమే కాకుండా ఉత్తమ తెలుగు చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకుంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో  74 కేంద్రాలు రిలీజ్ అయ్యి,74 కేంద్రాల్లో కూడా 100 రోజులు ఆడింది.

2.  ప్రేమించుకుందాం రా:
1997వ సంవత్సరంలో ప్రేమించుకుందాం రా సినిమా యాభైకి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది..

3. జయం మనదేరా :
ఇక ఈ సినిమా కూడా వందకు పైగా కేంద్రాలలో విడుదలయ్యే మొత్తం ఒక్కో కేంద్రంలో 50 రోజుల చొప్పున ఆడి తొలి విజయాన్ని సాధించింది

4. చంటి :
ఇక ఈ సినిమా కూడా తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అత్యంత రికార్డును సృష్టించింది. మొత్తం 33 కేంద్రాల్లో 100 రోజుల పాటు ఆడి సక్సెస్ ఫుల్ ఈవెంట్ ను విజయవంతం చేసుకుంది.

అంతేకాకుండా 2000 సంవత్సరానికి ఆల్ టైం టాప్ టెన్ తెలుగు సినిమాలలో ఒక్క వెంకటేష్ సినిమాలే ఐదు ఉండడం విశేషం. ఇది ఎప్పటికీ ఒక రికార్డు గానే ఉండిపోయింది. కలిసుందాం రా,రాజా,జయం మనదేరా, సూర్యవంశం, ప్రేమించుకుందాం రా,  కొండవీటి సింహం వంటి సినిమాలు వెంకటేష్ ని ఒక మంచి పొజిషన్ లో నిలబెట్టాయి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: