అల్లు అర్జున్ అదృష్టాన్ని ఆశించని సుమంత్ !
అయితే ఆ మూవీ తనకు ఏమాత్రం సరిపోదు అంటూ సుమంత్ ఆమూవీ ఆఫర్ ను రిజక్ట్ చేయడంతో ఆమూవీ చివరకు బన్నీ వద్దకు చేరింది. ఈ విషయాన్ని సుమంత్ తన లేటెస్ట్ మూవీ ‘కపటధారి’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసాడు. అంతేకాదు ఆ మూవీని తాను వదులుకున్నందుకు ఇప్పటికీ తాను బాధపడటం లేదనీ అలాంటి పాత్రలకు తాను సరిపోను అంటూ కామెంట్స్ చేసాడు.
వాస్తవానికి సుమంత్ ను హీరోగా నిలబెట్టాలని అతడి తాత అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉన్న రోజులలో ఎన్నో ప్రయత్నాలు చేసారు. అయితే ఆ ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈమధ్య కాలంలో సుమంత్ నటిస్తున్న సినిమాలు అప్పుడప్పుడు వస్తున్నా వాటిని పట్టించుకునే స్థితిలో ప్రేక్షకులు లేరు.
లేటెస్ట్ గా విడుదలైన ‘కపటధారి’ మూవీ కన్నడంలో హిట్ అయినప్పటికీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు నచ్చినట్లుగా వార్తలు రావడం లేదు. ఈమూవీ ప్రమోషన్ కోసం స్వయంగా నాగార్జున స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ ఈమూవీకి రివ్యూలు కూడ అంతంతమాత్రంగానే రావడంతో మరోకారి దురదృష్టం సుమంత్ ను వెంటాడింది అనుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ బ్యాకింగ్ ఉన్నప్పటికీ మంచి నటుడుగా పేరు ఉన్నప్పటికీ ఈ అక్కినేని హీరో తాను ఎంచుకునే కథల విషయంలో పొరపాట్లు చేయడం వల్ల సుమంత్ కెరియర్ ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. ఏమైనా సుమంత్ తిరస్కరణ బన్నీకి ఆ రోజులలో అదృష్టంగా మారింది అనుకోవాలి..