ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

shami
ఆర్జీవి డైరక్షన్ లో థ్రిల్లర్ మూవీతో సూపర్ పాపులర్ అయ్యింది అప్సరా రాణి. లాక్ డౌన్ టైం లో తన థై షో తో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఈ అమ్మడు మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. భూం బద్ధలు సాంగ్ తో నిజంగానే ఆడియెన్స్ హృద్యాలను బద్ధలు కొట్టేసింది అమ్మడు. ఇక ఆ సాంగ్ తో వచ్చిన క్రేజ్ తో మరిన్ని ఛాన్సులు అందుకుంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా అప్సరా రాణికి మరో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

మాస్ హీరో గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న సీటీమార్ సినిమాలో అప్సరా రాణి ఐటం సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమన్నాతో పాటుగా అమ్మడి అందాలు కూడా సినిమాకు హైలెట్ అవుతాయని అంటున్నారు. అప్సరా రాణి సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది అంటే సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఇక గోపీచంద్ సీటీమార్ సినిమా తర్వాత మరుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ రెండిటితో పాటుగా తేజా డైరక్షన్ లో కూడా అలిమేలు వెంకటరమణ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. కొన్నాళ్లుగా కెరియర్ లో వెంకపడ్డ గోపీచంద్ ఈ మూడు సినిమాలతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. తప్పకుండా ఈ కాంబినేషన్స్ అన్ని గోపీచంద్ కు కలిసి వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే రవితేజతో క్రాక్ సినిమాలో అప్సరా ఐటం సాంగ్ అదిరిపోగా దాన్ని మించేలా గోపీచంద్ సీటీమార్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది.                                        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: