తన భర్త సినిమా ఎంట్రీ గురించి స్పందించిన నిహారిక...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మెగాస్టార్ ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలిష్ ఫ్యామిలీ గా మెగా ఫ్యామిలీ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలగా పరిచయం అవ్వడం జరిగింది. అందులో ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలిన వాళ్లంతా తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు.మొదటి సినిమాతోనే మంచి ఘన విజయం సాధించాడు. అయితే కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నట్లు వార్తలు వినిపించాయి. మెగా డాటర్ నీహారికని పెళ్లి చేసుకున్న చైతన్య జొన్నలగడ్డకి నటన అంటే ఇష్టమని.. తను కూడా హీరోగా వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు.

మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రావడంతో.. ఇక మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక భర్త చైతన్య కూడా హీరో అయిపోతాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది నీహారిక. తన భర్తకు సినిమాలంటే చాలా ఇష్టమని.. కొత్త సినిమాలన్నీ చూస్తుంటారని.. కానీ నటనపై ఎలాంటి ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. పైగా నటన అనేది ఒక ప్యాషన్ అని.. చిన్నప్పటి నుండి దానిపై ఆసక్తి ఉండాలని.. ఇప్పటికిప్పుడు అంటే రాదని.. అందుకే చైతన్య సినిమాల్లోకి రాడని చెప్పింది.

హీరో అంటే మాటలు కాదని.. చాలా కష్టపడాలని చెప్పింది. తన భర్త నేపధ్యం వేరని.. సినిమాలు చూస్తుంటారే తప్ప. నటించరని.. అలాంటి ఉద్దేశం తమ కుటుంబంలో ఎవరికీ లేదని క్లారిటీ ఇచ్చింది. నీహారిక మాటలను బట్టి చైతన్య హీరోగా వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది!ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇంకా  మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: