ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !
ఈసినిమాలోని సెన్సిటివ్ పాయింట్ మీద ఒక సెక్షన్ ఆడియెన్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ విపరీతంగా రావడంతో ఈ సినిమాలో ఉన్న అసలు విషయం అంతా డైవర్ట్ అయిపోయి ఈ సినిమాలోని నెగిటివ్ విషయాల పై దృష్టి పెట్టడంతో ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దెబ్బతింటుందా అన్న సందేహాలు మొదలు అయ్యాయి. అయితే ఈ మూవీ క్లైమాక్స్ పాయింట్ ని కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ బాగా హర్షిస్తున్నారు.
సినిమాలో మెయిన్ ట్విస్ట్ తెలిసిపోయినా ‘ఉప్పెన’ ను చూడటానికి జనం బాగానే వస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ‘బాహుబలి’ ని కట్టప్ప చంపుతాడు అన్న విషయం తెలిసినా ఎందుకోసం చంపాడు అన్న పాయింట్ పై గతంలో ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చిన విధంగా ‘ఉప్పెన’ విషయంలో కూడ అలాగే జరుగుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి.
ఈ సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా రావడంతో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ కూడా కలెక్షన్స్ విషయంలో కల్సి వచ్చింది. అయితే ఈ మూవీ టైటిల్ కార్డ్ పడకముందే త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రాబోతోందని చెప్పడంతో ఈ మూవీ ఎలాగు నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు టికెట్ కొనుక్కుని థియేటర్స్ కు వెళ్ళి ఈ సినిమాను ఎందుకు చూడాలి అంటూ కొందరు ‘ఉప్పెన’ ను చూడటానికి థియేటర్స్ కు రాకపోయే అవకాశం ఉంది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనికితోడు కొందరునెగిటివ్ కామెంట్స్ చేయడం మరింత ఆశ్చర్యంగా మారింది..