
RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?
ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత చరణ్, శంకర్ కాంబో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి.తాజాగా చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అదెంటంటే.. శంకర్ తీసే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో.. అందులోని సాంగ్స్ కూడా అదే రేంజ్లో హిట్ అవుతాయి. దాదాపు ఆయన సినిమాలన్నింటికి ఆయన సన్నిహుతుడు ఏ.ఆర్.రెహమాన్ కానీ హ్యారిస్ జైరాజ్ కానీ సంగీతాన్ని అందిస్తుంటారు. తాజా సమాచారం ప్రకారం శంకర్ ఈసారి వీరిద్ధరిని కాదని.. మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అతనేవరో కాదు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌ను ఈ సినిమా కోసం సెలక్ట్ చేయనున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటి వరకు ఈ వార్త సంబంధించి ఎలాంటి అఫిషియల్ అప్ డేట్ రాలేదు. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని తీసుకుంటాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...