విలన్ గా మారబోతున్న స్టార్ హీరోయిన్.. అభిమానుల్లో ఆత్రుత..?

praveen
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ధూమ్ సిరీస్ ల కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధూమ్ వన్ నుంచి ధూమ్ త్రి వరకు కూడా ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాలను అందుకుంది. అంతేకాదు అటు హీరోలకు మంచి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధూమ్ సిరీస్ లకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.  అయితే దూమ్ సిరీస్ తెరకెక్కుతుంది అంటే చాలు అటు  ప్రేక్షకులందరిలో  ఆత్రుత పెరిగి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ధూమ్ సిరీస్ 4 తీయడానికి ప్రస్తుతం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


 ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ధూమ్ ఫోర్ లో దీపికా పదుకొనే నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకు దీపికా పదుకొనేను గ్లామర్ పాత్రల్లో ఎంతో మంది ప్రేక్షకులు చూశారు అంతేకాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని ప్రేక్షకులను మెప్పించింది దీపికా పదుకొనే.



 కానీ ధూమ్ ఫోర్ లో మాత్రం ఇప్పటి వరకు నటించని సరికొత్త పాత్రలో నటించబోతున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అయితే ధూమ్ ఫోర్ తెరకెక్కించేందుకు ప్రస్తుతం మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉండగా ఇక ఈ సినిమాలో ప్రతినాయకురాలి  పాత్ర గత సినిమాల కంటే ఎంతో భిన్నంగా ఉంది అనే టాక్ వినిపిస్తోంది.  ఇక ఈ భిన్నమైన పాత్ర కోసం దీపికా పదుకునేను చిత్ర బృందం సంప్రదించగా తో ఇక పాత్ర నచ్చడంతో వెంటనే దీపికా కూడా ఓకే చెప్పేసిందట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: