బాలీవుడ్ హాట్ బ్యూటీ పై కన్నేసిన టాలీవుడ్ డైరెక్టర్స్.. ఫ్రాన్స్ లో ఆత్రుత..?

praveen
బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ కి బీ టౌన్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో హాట్ హాట్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఆలియాభట్. వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తనదైన అందం చందం తో బాలీవుడ్ ప్రేక్షకుల మనసులు  దోచేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు  అందరికీ అటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.



 అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ బిజీ బిజీగా గడుపుతున్న ఆలియాభట్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్  సినిమాలో నటిస్తోంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయితే ఆర్ఆర్ఆర్  అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బీ టౌన్ బ్యూటీ. ఈ క్రమంలోనే ఆలియాభట్ ను మరిన్ని సినిమాల్లో నటింప  పనిచేయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.



 ఇక తమ సినిమాలలో ఆలియా భట్ ను  తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట టాలీవుడ్ దర్శకులు. ఈ క్రమంలోనే కథలు పట్టుకొని ఇక ఈ అమ్మడు దగ్గరికి పరుగులు పెడుతున్నారట. ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఇక అలియా భట్ కు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ఇక ఆ క్రేజ్ ను తమ సినిమాలకు ఉపయోగించుకోవాలని దర్శకులు  భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆలియాభట్ ను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరీ ఆలియాభట్ టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటుందా లేదా అన్నది అటు అభిమానుల్లో కూడా ఆత్రుత నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: