ప్రేమ కోసం రోమియో చనిపోయాడు.. కాని మనం అలా కాదు.. రాధే శ్యామ్ టీజర్ డైలాగ్ లీక్..!

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జిల్ ఫేం రాధాకృష్ణ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్.. ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే నటిస్తున్నారు. ఇక సినిమా టీజర్ ఈ వాలెంటైన్స్ డే నాడు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సినిమా టీజర్ రిలీజ్ అవకుండానే టీజర్ లోని డైలాగ్స్ లీక్ అయ్యాయి.

ఇక ఈ టీజర్ లోని డైలాగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విక్రమాదిత్య ప్రేరణ మధ్య డైలాగ్ ఒకటి లీకైంది.. నువ్వేమైనా రోమ్యో అనుకుంటున్నావా అని ప్రేరణ అంటుందట.. దానికి బదులిస్తూ ప్రేమ కోసం రోమియో చనిపోయాడు కాని మనం అలా కాదని విక్రం ఆదిత్య చెబుతాడట. ఈ డైలాగ్ టీజర్ లో ఉంటుందని చెబుతున్నారు. స్టార్ సినిమా అంటే చాలు ఎక్కడో ఓ చోట నుండి లీక్ అవడం కామన్ గా మారింది.

సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా డేట్ ఎనౌన్స్ చేయలేదు. సమ్మర్ టార్గెట్ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. కాని ఇప్పటికే సమ్మర్ లో స్టార్ సినిమాలన్ని ఖర్చీఫ్ వేసేశారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇదే కాదు ఓ పక్క ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు ప్రభాస్. రాధే శ్యాం పనులు పూర్తి కాగానే సలార్, ఆదిపురుష్ లకే పూర్తిగా డేట్స్ ఇచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. సలార్ 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: