కొడుకు రొమాన్స్ చేసిన హీరోయిన్స్ తో తండ్రి..!

NAGARJUNA NAKKA
సీనియర్ హీరోలు యంగ్‌ హీరోయిన్స్‌తో స్టెప్పులెయ్యడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ చిరంజీవి మాత్రం యంగ్‌హీరోయిన్స్‌నే ప్రిఫర్ చేస్తున్నాడు. కొడుకుతో రొమాన్స్‌ చేసిన హీరోయిన్స్‌నే సెలక్ట్‌ చేసుకుంటున్నాడు. నెక్ట్స్‌ బాబీ సినిమాకి కూడా చెర్రీ హీరోయిన్‌నే తీసుకుంటున్నాడట చిరు.

చిరంజీవి న్యూ లుక్‌ చూశాక సినిమా సినిమాకి యంగ్‌ అవుతున్నాడని చాలామంది కామెంట్ చేస్తున్నారు. 'ఆచార్య' లుక్‌ చూస్తోంటే చిరంజీవి సీనియర్‌ సిటిజన్‌లా అస్సలు కనిపించడం లేదని అభిమానులు కూడా అంటున్నారు. అయితే లుక్‌లోనే కాదు, హీరోయిన్‌ సెలక్షన్‌లోనూ చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు చిరు. తన కంటే వయసులో 30 ఏళ్లు తక్కువున్న హీరోయిన్స్‌తో స్టెప్పులేస్తున్నాడు.

చిరంజీవి రీఎంట్రీలో ఎక్కువగా రామ్ చరణ్‌తో రొమాన్స్‌ చేసిన హీరోయిన్స్‌నే సెలక్ట్‌ చేసుకుంటున్నాడు. 'మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే' సినిమాల్లో చరణ్‌తో కలిసి నటించిన కాజల్‌తో చిరు 'ఖైదీ నం.150' చేశాడు. ఇప్పుడు 'ఆచార్య'లోనూ కాజల్‌తో కలిసి పాటలు పాడుకుంటున్నాడు మెగాస్టార్.

చిరంజీవి నెక్ట్స్ బాబీ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్ గానీ, శ్రుతీ హాసన్‌ని గానీ తీసుకోవాలనుకుంటున్నారట. రకుల్‌ ఇంతకుముందు చరణ్‌తో 'ధృవ, బ్రూస్‌లీ' సినిమాలు చేసింది. ఇక శ్రుతీ హాసన్‌ 'ఎవడు'లో చరణ్‌తో స్టెప్పులేసింది. ఇక ఈ ప్రచారం బయటకురాగానే చిరు, చరణ్‌ హీరోయిన్స్‌ని ఎవరినీ విడిచిపెట్టేలా కనిపించడం లేదని కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి రామ్ చరణ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసేందుకు చిరంజీవి సిద్ధమైపోయాడు. రొమాన్స్ ఒక్కటే కాదు ఆట పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నాడు. ఎవడు సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన శృతిహాసన్ ఇప్పుడు చిరుతో కూడా నటిస్తోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు రామ్ చరణ్ తో ధృవ, బ్లూస్ లీ సినిమాల్లో ఆడిపాడిన రకుల్ ప్రీత్ సింగ్ కు సైతం ఆ అవకాశం వస్తోంది.. చూద్దాం.. ముందు ముందు ఏం జరుగుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: