స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. !
మహేశ్ బాబు ఎప్పుడూ లేనిది 'సర్కారు వారి పాట'కి మాత్రం ఏడాది ముందే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేశాడు. 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'తో సూపర్ హిట్ కొట్టిన ప్రిన్స్, 2022 సంక్రాంతికి 'సర్కారు వారి పాట'తో బ్లాక్‌బస్టర్ కొడతాడని మహేశ్ టీం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక ఈ సినిమా 2022లో జనవరి 14న బరిలో దిగుతుందని సమాచారం.
బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఒకేసారి నాలుగైదు సినిమాలు అనౌన్స్ చేసిన పవన్, వచ్చే సంక్రాంతికి క్రిష్ సినిమా రిలీజ్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు. జమీందార్లని దోచుకొని, పేదలకు పంచే మంచిదొంగ వీరమల్లుగా నటిస్తున్నాడని చెబుతున్నారు.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి 'క్రాక్'తో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని నెక్ట్స్ బాలక్రిష్ణని డైరెక్ట్ చెయ్యబోతున్నాడట. ఆల్రెడీ సబ్జెక్ట్ ఓకే అయ్యిందని బోయపాటి శ్రీను సినిమా పూర్తవ్వగానే ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని చెబుతున్నారు. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు టాలీవుడ్ జనాలు.
ఫిల్మ్ సర్కిల్స్‌లో జరుగుతోన్న ప్రచారం నిజమైతే గనుక వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌కి వసూళ్ల పండగ వస్తుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుతో పాటు బాలక్రిష్ణ కూడా బరిలో దిగితే రెండు వందల యాభై కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. మరి వచ్చే సంక్రాంతి ఈ ముగ్గురితోపాటు ఇంకెంతమంది హీరోలు బరిలో దిగుతారు, ఎంత బిజినెస్ చేస్తారో చూడాలి.