'ఉప్పెన' హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ కృతి కాదని మీకు తెలుసా....??
రాయనం అనే పవర్ఫుల్ పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుని తామందరికీ మంచి పేరు తీసుకు వస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల కొద్ది రోజుల నుంచి మీడియా ఛానల్స్ కి పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది మూవీ యూనిట్. అందులో భాగంగా ఇటీవల ఒక మీడియా ఛానల్ తో దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ ఈ సినిమా స్టోరీ తాను మొదట అనుకున్నప్పుడు తన గురువైన సుకుమార్ వినిపించానని, హీరోగా మాత్రం పంజా వైష్ణవ్ తేజ్ ని అనుకోకుండా ఒకరు చూపించిన ఫోటో చూసిన అనంతరం ఫిక్స్ అయ్యానని అన్నారు.
అయితే హీరోయిన్ గా ఇటీవల సునీల్ హీరోగా తెరకెక్కిన టూ కంట్రీస్ సినిమాలోని మనిషా అయితే వైష్ణవ్ కి జోడిగా సరిపోతుందని తాను భావించినప్పటికీ ఆ తర్వాత ఎందుకో తన మనసు అంగీకరించలేదని ఆమె బదులు వేరొక హీరోయిన్ ని తీసుకోవాలని ఆలోచన కలగడంతో అదే విషయాన్ని గురువు అయిన సుకుమార్ కి చెప్పానని అన్నారు. మనందరి వ్యక్తిగత అభిప్రాయం కంటే సినిమా ఎవరినైతే కోరుకుంటుందో వారిని తీసుకో కాబట్టి మార్చాలనుకుంటే హీరోయిన్ ని మార్చేయి అంటూ సుకుమార్ చెప్పారని అనంతరం జరిగిన ఆడిషన్స్ లో భాగంగా కృతిని ఫైనల్ గా హీరోయిన్ గా ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు బుచ్చిబాబు. ఆ విధంగా ఈ సినిమాలో హీరోయిన్ గా మనీషాకు ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారింది అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా, రిలీజ్ తర్వాత ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!