మళ్ళి రిస్క్ తీసుకుంటున్న రవితేజ..!?
ఇక ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మే 28న సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఖిలాడి తర్వాత మాస్ రాజా ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. కెరీర్లో చాలా మంది కొత్త వాళ్లకు ఛాన్సులు ఇచ్చాడు రవితేజ. ఆయన చేతుల మీదుగానే శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను లాంటి దర్శకులు పరిచయం అయ్యారు.
ఇప్పుడు వాళ్లంతా స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు. ఇక తాజాగా గులాబీ శ్రీను అనే దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు రవితేజ. ఈయన చెప్పిన కథ నచ్చడంతో మాస్ రాజా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కాటమ రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు గులాబీ శ్రీను. అలాగే క్రాక్ సినిమాకు కూడా గోపీచంద్ మలినేని దగ్గర అసిస్టెంట్‌గా చేసాడు ఈయన.
ఇక ఏడాది కిందే మాస్ రాజాకు కథ చెప్పడం.. గతేడాది నుంచి రవితేజ కూడా కథలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పడం అన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యే దర్శకుడు ఫైనల్ నెరేషన్ ఇవ్వడంతో రవితేజ కూడా ఖిలాడి తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడు. ఏదేమైనా కూడా క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమా అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న పనే.